నెల్లూరు జిల్లాలో రోజురోజుకీ దారుణాలు

నెల్లూరు జిల్లాలో రోజురోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ నాయకుల అండదండలు మెండుగా ఉండటంతో చట్టాలను సైతం బుట్టధకలు చేస్తున్నారు. నడిరోడ్డు పై భౌతిక దాడులకు తెగబడిన అడిగే నాధుడే లేకుండా పోయాడు. పోలీసులకు నేరస్తులు పట్టుబడకుండా ఉండేందుకు మార్గాలను వేతుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే నెల్లూరు నగరంలో చోటుచేసుకుంది. నగర నడిబొడ్డులో ఒక కుటుంబ జీవనాధారం పై కొట్టారు. గత పదేళ్లుగా ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసుకొంటూ జీవనం సాగిస్తున్న విరరాఘవయ్య అనే వ్యక్తి షాపును అర్ధరాత్రి నిట్టనిలువునా కూల్చేశారు. జనవరి ఫస్ట్ రానుండటంతో ఫ్లెక్సీలు వేసుకొని నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చని రాత్రి 12 గంటల వరకు ఉండి పనిచేసుకొని వెళ్లిన షాపు యజమానికి ఉదయానికి గుండె పగిలిపోయే విధంగా సంఘటన కనిపించింది. తన జీవనాధారమైన షాపు నెలకులిపోయి ఉండటంతో ఆవేదనకు గురయ్యాడు. విచారయించిన తరువాత షాపు బిల్డింగ్ యజమాని కూల్చినట్టు తెలియడంతో యజమానిని నిలదీస్తే బిల్డింగ్ యజమాని దాడికి ప్రయత్నంచాడు. దింతో వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. షాపులో బాడుగకు ఉండే వ్యక్తికి, బిల్డింగ్ యజమానికి మధ్య ఉన్న వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఎటువంటి సమాచారం లేకుండా బిల్డింగ్ కూల్చివేయడం పై పోలీసులు కేసు నమోదు చేశారు. షాపు కూల్చే సమయానికి షాపులో ఉన్న కొంత నగదుతో పాటు.. కంప్యూటర్లు, మిషన్లు అన్ని శిధిలాల క్రింద పడి నాసనమై పోయాయని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో రాఘవయ్య పేర్కొన్నారు. ఇంతకీ కూల్చిన వ్యక్తులను కనుగొనేందుకు పోలీసులు వేట మొదలుపెట్టారు. అయితే ఇటు పోలీసులకు మాత్రం నెల్లూరు నగరంలో జరుగుతున్న ప్రతి కేసు సవాలుగా నిలుస్తుంది. నెల్లూరు నగరంలో మూగబోయిన నిఘా కెమెరాలు జరుగుతున్న నెరఘటనలకు సాక్షాలుగా నిలుస్తున్నాయి. అరాచకాలు, సంఘ వ్యతిరేక ఘటనలు, మర్దర్లు చేసి తప్పించుకుంటున్న వారికి నెల్లూరు నగరంలో పనిచేయని సీసీ కెమెరాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. నెలలు గడుస్తున్నా నడి రోడ్డుపై జరిగిన హత్యలకు ఆధారాలు దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఇలాంటి ఘటనలు పై పోలీసులు ఎలా స్పందిస్తారో ఎదురు చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here