రెచ్చిపోయిన సచివాలయం అడ్మిన్..

వాలంటీర్లు అంటే అలుసా..!!
రెచ్చిపోతున్న అడ్మిన్లు లబోదిబోమంటున్న వాలంటీర్లు తాజాగా నెల్లూరు నగరం 9వ డివిజన్ లో వెలుగులోకిప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ అడ్మిన్ల వల్ల ఆత్మపరిశీలన లో పడింది. అయిన దానికి.. కానిదానికి అడ్మిన్ల నుంచి తిట్లు తినాల్సి వస్తుంది. వారి వేధింపులు, అరాచకాలు భరించలేక ఎదురు తిరుగుతున్నవారిని విధులనుంచి పీకేస్తుండడంతో ఓపికతో భరించాల్సిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎదురవుతోంది.

తాజాగా నెల్లూరు నగరంలోని 9వ వార్డు సచివాలయంలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి ఓ మహిళా అడ్మిన్ వాలంటీర్ లను లక్ష్యం గా చేసుకుని వినారాని బూతులు తిడుతూ అందర్నీ విస్మయానికి గురిచేసింది.ఈనెల ఒక పుట కొందరు వాలంటీర్లు ఆఫీసు కు రాలేదు. తనకు చెప్పకుండా మీటింగ్ కు ఎందుకు వెళ్లారు అని వాలంటైర్లు ఫైవ్విరుచుకొని పడ్డారు. వారు డివిజన్ ఇంచార్జ్ పిలిస్తే వెళ్ళాము అని సమాధానం ఇచ్చినా పట్టించుకోని అడ్మిన్ ..మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటూ బూతు పురాణం అందుకుంది.. తనకూ పలుకుబడి ఉంది, తెలిసినవారు ఉన్నారు అంటూ తిట్ల దండకం అందుకుంది. పాపం తుమ్మితే ఉడిపోయే ముక్కులా వాలంటీర్లు మౌనంగా ఉండిపోయారు. ఇదే పరిస్థితి నగరంలో, జిల్లాలో అనేక చోట్ల జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పధకాలను ప్రజలకు అందించడంలో కీలకంగా వ్యవహరించే ఆ అభాగ్యులపై వారి పెత్తనం, దౌర్జన్యాలను వాలంటీర్లు ఇంకా ఎంతకాలం భరించాలో మరి.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు

సదరు సచివాలయం అడ్మిన్ పై జిల్లా ఉన్నతాధికారులు కు కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందింది. దీనిపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులు కోరినట్లు తెలిసింది. ఆ బూతు పురాణం అడ్మిన్ గతంలో టిక్ టాక్ చేస్తూ.. ఫేమ్ అయింది ఇంకా ప్రోభిషన్ పిరియడ్ కూడా తీరని ఆ మహిళా అడ్మిన్ ఇలా చేయడం ఏంటా అని అంతా ఆశ్చర్య పోతున్నారు.ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని అంతా ఎదురు చూస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here