తొలి ఏడాది-జగనన్న తోడు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తైన నేపథ్యంలో “ తొలి ఏడాది-జగనన్న తోడు “..  ప్రజా పాలన సంక్షేమంలో భాగంగా  “మనపాలన- మీ సూచన “ పై మంగళవారం ఉదయం నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మేథోమథన కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి శ్రీ డా.పోలుబోయిన అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి “మన పాలన- మీ సూచన“ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి.., ఏడాది పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం వ్యవసాయ- అనుబంద రంగాలపై సంబంధిత శాఖల హెచ్.ఓ.డిలు…, ముఖ్యమంత్రికి పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి డా. అనిల్ కుమార్ మాట్లాడుతూ… వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి.., సహకార సంఘాల ద్వారా డెయిరీ ఫార్మ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లాలో 660 రైతు భరోసా కేంద్రాలను మే 30 న ప్రారంభించనున్నామని.., వీటి ద్వారా నూతన వంగడాలను సాగుచేసేలా రైతులకు సూచనలివ్వాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలవాలని.., వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను, నూతన వంగడాలపై అధికారులు అవగాహన పెంచుకుని.., రైతులకు వివరించాలన్నారు. ఖరీఫ్, రబీలలో ఏ పంట వేస్తే.., లాభం కలుగుతుందో రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదన్నారు.

ఈ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు మాట్లాడుతూ.., కేంద్ర ప్రభుత్వ పథకాల ఏమున్నాయి.., వాటి ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చు.., ఏ పరిశ్రమ స్థాపిస్తే రైతులకు, మహిళా పారిశ్రామిక వేత్తలకు మేలు కలుగుతుంది అనే దృక్కోణంలో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే బాధ్యత అధికారులదని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సలహాలు అందించాలన్నారు. జిల్లాలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి అవసరమైన నిధులు తాను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సదస్సులో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డా. శ్రీ వి.వినోద్ కుమార్ మాట్లాడుతూ.., జిల్లాలో రైతు భరోసా కింద 4,27,057 రైతు కుటుంబాలకు 293.437 లక్షలు సాయం అందించామన్నారు. జిల్లాలో 660 రైతు భరోసా కేంద్రాలు మే 30న ప్రారంభించనున్నామని.., ఇప్పటికే శాస్వత ప్రాతిపదిక 631 రైతు భరోసా కేంద్రాలు నిర్మించడానికి నిధులు కేటాయించామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here