జిల్లాలో “ఫ్లెక్సీల గోల”

జిల్లాలో ఫ్లెక్సీల వివాదం రోజు రోజుకి ముదురుతోంది..అధికార పార్టీకి చెందిన నేతలే తమ దివంగత నేత ఫ్లెక్సీలు తీసేసారంటూ సాక్షాత్తు మంత్రి అనిల్ పై అక్కసు వెళ్లగక్కారు. తనకు ఏమీ తెలియదు.. అదంతా కార్పొరేషన్ అధికారుల చర్య అని అనిల్ సైతం వివరణ ఇచ్చారు..ఆ తర్వాత బీజేపీ వంతైంది. తమ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫ్లెక్సీలు కూడా తొలగించారు.. అంటూ అధికాశ్రపార్టీకి ఆపాదించారు..

అంతటితో ఈ ఫ్లెక్సీల వ్యవహారం సద్దిమణిగింది అనుకుంటుండగా తాజాగా బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలో సోమవారం తెలుగుదేశం పార్టీ వంతు వచ్చింది. నారా చంద్రబాబునాయుడు, బాలకృష్ణ ఫ్లెక్సీలను సైతం దుండగులు చించేసారంటూ ఆందోళనకు దిగారు. దీని వెనుక వైసీపీ నాయకులు ఉన్నారంటూ ఆరోపిస్తూ నినాదాలు చేపట్టారు. ప్రస్తుతం బుచ్చిలో ఆందోళనకరంగా ఉంది.

మొన్నటికి మొన్న బుచ్చిలో టీడీపీ కార్యాలయం ఆవరణంలో మాజీ కోవూరు MLA పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఫ్లెక్సీ ని గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అప్పుడు కూడా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లాలో అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను తొలగించే క్రమంలో మునిసిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీ నేతల ఫ్లెక్సీలను లక్ష్యం గా చేసుకొని చించడం, తగలబెట్టడం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రజాప్రతినిధులకు ఆపాదిస్తున్నారని ఆయా నేతల అనుచరులు వాపోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు జిల్లాలో ఫ్లెక్సీల గోల మొదలైనటు మాత్రం స్పష్టం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here