నకిలీ ఎలక్ట్రానిక్ చిప్ ను ఉపయోగించి వినియోగదారులకు పెట్రోల్ డీజిల్ అమ్మకాలలో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీమ్ అస్మి గారికి రాబడిన సమాచారం మేరకు, ఎస్పీ గారు ఆదేశించిన విధంగా అమలాపురం Dsp షేక్ మాసుంభాష ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద పోలీసులు, తూనికలు మరియు కొలతల శాఖ, రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది .. ఈ తనిఖీల్లో భాగంగా కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడేకురు గ్రామంలో ఉన్న భారత్ పెట్రోలియం లిమిటెడ్ ఏజెన్సీ అయినటువంటి సుభద్ర ఫీలింగ్ స్టేషన్ నకిలీ ఎలక్ట్రానిక్స్ చిప్ ఉపయోగించి వినియోగదారులకు నష్టం కలిగించే విధంగా పెట్రోల్ డీజిల్ అమ్మకాలు చేయడం జరుగుతుంది ఈ చిప్ను వాడడం వల్ల పెట్రోల్ మరియు డీజిల్ ఫీలింగ్ చేసేటప్పుడు ప్రతి లీటర్కు 30 ml తక్కువ వచ్చే విధంగా దీనిని అమర్చడం జరిగింది . తద్వారా అనేక మంది వినియోగదారులను మోసం చేయడం జరుగుతుంది .గత రెండు నెలల నుండి ఈ విధంగా వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.. దీనికి కారణమైన బంకు మేనేజర్ బుల్లి మంతు శేషు కుమార్ సన్నాఫ్ మల్లికార్జునరావు మరియు ఈ బంకు లీజుకు తీసుకున్న యజమాని చందు కనకయ్య ఏలూరు నివాసి పై కేసు నమోదు చేయడం జరిగింది . మేనేజర్ ను అరెస్ట్ చేయడం , రిమాండ్ కు పంపించడం జరుగుతుంది . బంక్ లీజుకు తీసుకున్న యజమాని చందు కనకయ్య పరారీలో ఉన్నట్లు అతనిని కూడా త్వరలో పట్టుకుని అరెస్టు చేయడం జరుగుతుంది అని డిఎస్పీ తెలిపారు.. ఈ మోసాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకున్న రావులపాలెం సీఐ వై.వి కృష్ణ మరియు ఎస్సై కొత్తపేట వారి సిబ్బంది ని అదేవిధంగా ఈ తనిఖీలకు సంయుక్తంగా సహకరించిన రెవెన్యూ అధికారులు మరియు తూనికలు కొలతల శాఖ అధికారులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here