వైభవంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు…

ది బుల్లెట్ న్యూస్ :- వంశీ

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం లోని కోళ్లమిట్ట గ్రామంలో అయ్యప్ప పడి పూజను ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో , ఆనందోత్సాహాలతో నిర్వహించారు. గ్రామం లోని త్రీ లింగేశ్వర స్వామి శివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠం వద్ద 18 మెట్లను సాంప్రదాయ బద్దంగా ఏర్పాటు చేసి మెట్టు మెట్టుకు విశేష పూజలు నిర్వహించారు.గురు స్వాములు అరణి మల్లికార్జున రెడ్డి స్వామి , నడవల శ్రీనయ స్వామి , మురళీ స్వామి , అరణి వేణు గోపాల్ రెడ్డి స్వామి , భాస్కర్ స్వామి , వెంకయ్య స్వామి పూజలు నిర్వహించారు. జన్మదినోత్సవాని పురస్కరించుకుని కోలాహలంగా అయ్యప్ప పడి పూజ , అన్నదానం నిర్వహించారు . దీంతో గ్రామం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here