ఆయ‌న‌కు ఫామ్ హౌసే గ‌తి.. – కేసీఆర్ పై మంత్రి సోమిరెడ్డి పైర్..

The bullet news (Podalakuru)- తెలంగాణ‌లో ప‌లితాల అనంత‌రం కేసిఆర్ ఫామ్ హౌస్ కే ప‌రిమితం అవుతార‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి జోస్యం చెప్పారు.. పొద‌ల‌కూరులో మీడియాతో మాట్లాడిన ఆయ‌న తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ పతనం తప్పదన్నారు.. మ‌హాకూట‌మి బ‌లోపేతంగా ఉంద‌ని, తెలంగాణాలో మ‌హాకూట‌మే అధికారంలోకి వ‌స్తుంది ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో కూటమి బలోపేత‌మ‌వుతుంద‌న్నారు.. తెలంగాణాలో కేసీఆర్, ఏపీలో జ‌గ‌న్ కు చంద్ర‌బాబు నాయుడ్ని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. అసెంబ్లీకి రాకుండా రోడ్ల‌మీద తిరిగితే ఎమ్మెల్యేల‌ను, నాయ‌కుల‌కు తానింత వ‌ర‌కు చూడ‌లేద‌న్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here