దిగ్బంధంలో ఉద్రిక్తం…ఆందోళనకారుల్ని ఈడ్చుకెళ్లిన పోలీసులు..

The bullet news ( Nellore)_: ఉద్రిక్తతలు.. నినాదాలు.. అరుపులు.. కేకలు, పోలీసులతో వాగ్వాదాల మధ్య ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయరహదారులు ఉద్రిక్తతలకు దారితీసింది.. జిల్లా వ్యాప్తంగా వైసీపీ, కాంగ్రెస్, సీపిఎం,. సిపిఐ శ్రేణులు రోడ్డుమీదకొచ్చి రహదారులను దిగ్బందించారు.., నెల్లూరు నగరంలోని బుజబుజనెల్లూరు జాతీయరహదారి దిగ్బందంలో ఉద్రికత్త చోటు చేసుకుంది.. గంటలపాటు రహదారిపై ఆందోళన కారులు బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపో్యాయి.. వామపక్ష నాయకుల కబడ్డి అడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.. రంగం ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులను ఈడ్చుకెళ్లారు.. ఈ సమయంలో ఆందోళనకారులకు, పోలీసులమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అసమర్దత వల్లే ప్రత్యేకహోదా ఆలస్యమవుతోందన్నారు.. జగన్ తోనే హోదా సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here