నా భార్య నాకు కావాలి..యువకుడి ఆవేదన..

ప్రేమించి.. మూడు ముళ్ళతో ఒక్కటైన తమను నా భార్య తరపు పెద్దలు, తల్లీదండ్రులతోపాటు నెల్లూరు 2వ నగర పోలీసులు కలసి తననుంచి బలవంతంగా తీసుకెళ్లారని ఓ యువకుడి ఆవేదన ఇది. నగరంలోని నవాబ్ పేటకు చెందిన దారా మస్తాన్ అనే యువకుడు ఏడాదిన్నరగా బెంగళూరులోని చింతస్మానికి చెందిన సహనాలు ప్రేమించుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ లో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ క్రమంలో మేజర్లు అయిన వారిని పోలీస్ స్టేషన్ నుంచే విడదీసి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. దాంతో అతడు గురువారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తన భార్య తనకు కావాలని… జిల్లా sp, రెండో నగర ci లు న్యాయం చేయాలని వేడుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here