నెల్లూరులో అమానుష ఘటన..భార్యాభర్తలకు కరోనా వచ్చిందని ఇంట్లో పెట్టి తాళం వేసిన అపార్ట్ మెంట్ వాసులు

ఉగ్రరూపం దాల్చి ఉపద్రవంలా వెంటాడుతున్న కరోనా మహమ్మారి… బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వైరస్తో అవస్థలు ఒకవైపు ఉంటే బాధిస్తుంటే… సమాజంలో ఎదురయ్యే చేతకారాలు… బహిష్కరణలు బాధితులను మరింత కుంగదీస్తున్నాయి. అలాంటి సంఘటన నెల్లూరు నగరంలోని నవాబ్పేట ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ లో చోటుచేసుకుంది. కరోనా సోకిందని బాధిత కుటుంబాన్ని ఇంట్లో పెట్టి తాళం వేశారు మానవత్వం లేని ఎదురింటి వాళ్ళు. నిన్నటి నుంచి చిత్రహింసలకు గురైన ఆ బాధితులు ఇవాళ పోలీస్ డయల్ 100కి కాల్ చేయడంతో వారి ఆవేదన, ఆక్రందన, ఆందోళన వెలుగుచూసింది.

అసలే కరోనాతో అల్లాడిపోతున్న ఆ కుటుంబాన్ని ఆదరించాల్సిన ఇరుగు పొరుగు వారు హింసలకు గురి చేశారు. అవసరాల కోసం బాధితుడు వచ్చాడని ఆగ్రహించిన ఎదురింటివారు చిత్రహింస లకు గురిచేశారు. కరోనా వైరస్ సోకితే బయటకు ఎలా వస్తారు అంటూ ఇంటికి తాళం వేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నెల్లూరు నగరంలోని నవాబ్ పేట ప్రాంతంలో జరిగిన ఈ దారుణం అందరినీకలచివేస్తుంది.బాధితులు హండ్రెడ్ చేయడంతో వెలుగుచూసింది. నవాబు పేట ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్ మెంట్ అయిదో ఫ్లోర్లో భార్య, భర్త..ఒకబాబు కలిగిన ఒక కుటుంబం నివసిస్తుంది. రెండు రోజుల క్రితం ఆ కుటుంభంలోనిభార్యాభర్తలిద్దరికీ కరోనాసోకింది. కుమారుడైన చిన్న బాబుకి నెగిటివ్ రావడంతో ఆ కుటుంబం ఇంట్లోనే ఉంటూ… వైద్యుల సలహాలతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోని నిత్యావసర వస్తువులు అయిపోవడంతో నిన్న బాధితుడు పూర్తిస్థాయి రక్షణ తో కిందకు వెళ్లి సరుకులు తెచ్చుకున్నాడు. దీనిని గమనించిన అపార్ట్మెంట్లోని ఎదురు నివసించే ఒక వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. తీవ్రంగా కోప్పడుతూ కరోనా బాధితులు తమ ఇంటి లోకి వెళ్ళగానే బయటనుంచి ఇంటికి తాళం చేశాడు. దీంతో నీరు లేక కనీసం పాలు కూడా లేకపోవడంతో బాధితులు అల్లాడిపోయారు. ఎంత బ్రతిమాలినా తమ ఇంటి తాళాలు తీయకపోవడంతో బాధితులు ఇవాళ హండ్రెడ్ కి డయల్ చేశారు. దాంతో నవాబు పేట పోలీసులు పూర్తి రక్షణ చర్యలతో అపార్ట్మెంట్ ఐదో ఫ్లోర్ లోకి వెళ్లి ఇంటి తాళం తీశారు. బాధితులకు మనో ధైర్యం కలిగించారు. కరోనా బాధితుల ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here