ఏసు బోధనలు ఆచరణీయం : 47ఇంచార్జి ఇలపాక శివకుమార్ ఆచారి

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వార్డ్ ప్రజలకు, క్రైస్తవ సోదరులకు 47ఇంచార్జిలు శివపురం సురేష్,ఇలపాక శివకుమార్ ఆచారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ యేసు బోధలను ఆదరించే సందర్భం. ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుంది. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులతో కలిసి ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం ప్రార్థిస్తున్నాను. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉంది. సాంఘిక దూరాన్ని పాటించటం, మాస్కు ధరించటం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని నివాసాలలో సురక్షితంగా ఉంటూ పండుగను జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ, మెరి క్రిస్మస్ శుభాకాంక్షలు” అని క్రిస్మస్ సందర్భంగా 47ఇంచార్జిలు శివపురం సురేష్,ఇలపాక శివకుమార్ సందేశం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here