నందవరం గ్రామంలో మహిళ పై కోతి దాడి…

షేక్ అస్లాం ఇంట్లోకి చొరబడి మహిళను కోతి గాయపరిచిన సంఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన ఆసియా అనే మహిళ ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఇంట్లో చొరబడ్డ కోతి ఆ మహిళలను గాయపరిచింది.దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.గతంలో కూడా గ్రామస్తులపై కోతులు దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here