మడ అడవుల నరికివేత దుర్మార్గం : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

జీవవైవిధ్యంలో కీలకమైన మడ అడవుల నరికివేత దుర్మార్గమని పేర్కొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాకినాడ సముద్ర తీరంలోని మడ అడవులను ప్రభుత్వమే వైసీపీ కాంట్రాక్టర్లతో నరికేయించడం సహించరాని విషయం..

మడ చెట్లు సముద్ర తీరంలో వేలాది జీవులకు ఆవాసంగా నిలుస్తున్నాయి…రొయ్యలు, చేప పిల్లల ఉత్పత్తిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి.

సముద్ర చేపల రారాజుగా పిలిచే పండు చేపకు పుట్టినిల్లు కూడా మడ చెట్లే..

మత్స్సకారులకు జీవనోపాధిని కల్పించడంతో పాటు తుఫాన్లు, బలమైన గాలులు వీచిన సమయంలో మడ అడవులు రక్షణగా నిలుస్తున్నాయి..తీర ప్రాంత కోతనూ అడ్డుకుంటున్నాయి…

సముద్రపు నీటిలో ఉప్పు శాతాన్ని తగ్గించి బ్యాక్ వాటర్ కారణంగా పొలాలు నాశనం కాకుండా కాపాడుతున్నాయి..

మడ అడవుల నరికివేత పర్యావరణానికి తీరని ముప్పుగా మారుతుంది…ఇది అంతర్జాతీయ స్థాయిలోనూ తీరని నేరంగా పరిగణిస్తున్నారు..

పర్యావరణ సమతుల్యంలో కీలకపాత్ర పోషించేది మడ చెట్లే..

ఎవరైనా తెలిసీతెలియక మడ చెట్లను నరికితే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కోట్లాది రూపాయలిచ్చి ఆ అడవులే లేకుండా చేయడం క్షమించరాని నేరం…

మడ అడవుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here