స్థానికి సమస్యల పరిష్కారానికి చర్యలు వర్షంలోనే 46వ డివిజన్ లో పర్యటించిన మంత్రి అనిల్

నెల్లూరు నగరంలో ని 46వ డివిజన్ లోని లాస్సి సెంటర్ ,మండపాల వీధి ,చిన్న బజార్, ప్రాంతాలలో శనివారం ఉదయం రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అధికారులు, నాయకులతో కలిసి పర్యటించారు. ఓ పక్క వర్షం పడుతున్నా… లెక్క చేయకుండా డివిజన్లోని . వీధుల్లో పరిశీలించారు. అక్కడి వ్యాపారులు, ప్రజలతో మాట్లాడారు.

ఆయా ప్రాంతాల్లోని సమస్యలు
అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముక్యంగా డివిజన్ లో ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని సచివాలయ అధికారులను ఆదేశించారు.

అనంతరం నవరాత్రి వేడుకల్లో భాగంగా చిన్నబజారు లోని శ్రీ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కమీషనర్, RDO, సంబంధిత అధికారులు ,46వార్డ్ ఇంఛార్జి వేలూరు మహేష్,47 వ ఇన్చార్జిలు శివపురం సురేష్  ఇలపాక శివ కుమార్ ఆచారి,49 వ వార్డ్ ఇంచార్జి వందవాసి రంగా , యువజన విభాగం అధ్యక్షుడు మజ్జిగ కృష్ణారెడ్డి, సచివాలయంలో సిబ్బంది , పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here