నెల్లూరులో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు… రక్తదానం చేసిన మంత్రి అనీల్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం నెల్లూరులో ఘనంగా జరిగాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని రాజన్నభవన్ లో జరిగిన వేడుకలకు నెల్లూరు ఎమ్పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా హాజరయ్యాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సిఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసి రక్తదాన శిభిరాన్ని మంత్రి, ఎంపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులతో కలిసి మంత్రి అనీల్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకం అని పేర్కొన్నారు. యువకులు కూడా అధిక సంఖ్యలో ముందుకు రావడం మరెంతో స్ఫూర్తినిచ్చే విషయం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ప్రతి ఒక్కరూ అభినందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయా డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, నేతలు సుధీర్, కర్తం ప్రతాప్ రెడ్డి, నూనె మల్లిఖార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here