రంగంలోకి దిగిన “మంత్రి అనిల్”

*రంగంలోకి దిగిన “మంత్రి అనిల్”*

*కోవిడ్ పై అధికారులు, ఆసుపత్రుల నిర్వాహకులతో వరుస సమీక్షలు*

*అదనపు బెడ్ల పెంపుపై తగు ఆదేశాలు*

*కోవిడ్ పేషంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించరు*

జిల్లాలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ప్రజల్లో భయం లేకుండా పోతోంది. ఓ పక్క రోజూ వందలాది కేసులు నమోదు అవుతున్నా.. మరణాల సంఖ్య పెరుగుతున్నా చలనం లేకుండా పోతోంది. అధికారులు సైతం సమీక్షలతోనే రోజులు వెళ్లదీస్తున్నారు. కలెక్టర్, jc స్థాయి అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వినడంలేదు. ఇక ప్రభుత్వ, కోవిడ్ ఆసుపత్రుల్లో అయితే కరోనా రోగుల రోదనలు అన్నీ అన్నీ కావు. బెడ్లు దొరక్క సామాన్యులు అల్లాడుతున్నారు. కొందరు నరకం అనుభవిస్తున్నారు. కోవిడ్ ను సాకుగా చూపి ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరిస్థితులు మారాలని, సామాన్యుడికి సైతం కోవిడ్ వైద్యం అందాలని, బెడ్లు సరిపడా సిద్ధం చేయాలని, ఆక్సిజన్ కొరత ఉండకూడదన్న లక్యంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగం లోకి దిగారు*
*కోవిడ్ తో ముడిపడి ఉన్న అన్ని రంగాలను సమన్వయం చేస్తూ.. నిర్లక్ష్యాన్ని విడనాడేలా చర్యలు చేపట్టారు. అందుకు 5 రోజులపాటు నగరంలోనే ఉంటూ… పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేలా నిర్ణయం తీసుకున్నారు
ఇందులో భాగంగా గురువారమే ఆయన విజయవాడ నుంచి నగరానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు బెడ్లు కొరత చూపి.. పైరవీలు చేసేవారికి, అధిక మొత్తం ఇచ్చేవారికి, లక్షల్లో కోవిడ్ ప్యాకేజీలు ఇచ్చేవారికే ఆసుపత్రుల్లో అడమీషన్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తుండటంతో మంత్రి అనిల్ వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అలాగే ఆయా ఆస్పత్రులపై కొన్ని ఆంక్షలు కూడా విధించనున్నారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు కూడా తీసుకొనున్నారు

*వీరిపైనా చర్యలు*
అంతే కాకుండా జిల్లాలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రులకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్ లు కొందరు సకాలంలో స్పందించక పోవడం పై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. వారికీ తగు హెచ్చరికలు చేయనున్నారు. అలాగే కొన్ని ప్రైవేటు ఆసుపాత్రుల నిర్వాహకులు ‘రెమ్ డేసివిర్’ వ్యాక్సిన్ ను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించకుండా వేలాది రూపాయలకు బ్లాక్ లో సైతం అమ్ముతూ దోచుకుంటున్న వైనం పై కూడా మంత్రి తగు చర్యలు చేపట్టనున్నారు.

*సౌకర్యాలపై దృష్టి*
ఆక్సిజన్ కొరత కూడా ఉండటంతో ఆ ఇబ్బంది లేకుండా.. కోవిడ్ ఆసుపత్రుల్లో తగినన్ని సిలిండర్లు అందుబాటులో ఉంచడం, కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచడం, రోగులకు పౌష్టిక ఆహారం అందించడం, ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు పెంచడం వంటి అంశాలపై కూడా ఉన్నతాధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీల నేతలు ఉద్దేశం పూర్వకంగా ప్రభుత్వంపై, జిల్లా ఉన్నతాధికారులపై చేస్తున్న ఆరోపణలను కూడా మంత్రి తిప్పి కొట్టనున్నారు. రెడ్ క్రాస్ వంటి సంస్థల సేవలను కూడా ఈ కోవిడ్ విపత్తులో ఉపయోగించుకోవడం పైనా ఆయన చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here