చంద్రబాబు పై మంత్రి అనిల్ కుమార్ ఫైర్

చంద్రబాబు పై మంత్రి అనిల్ కుమార్ ఫైర్

అమరావతి లో మీడియా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.చంద్రబాబు రెండు నెలల తరువాత వచ్చి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడని.రాష్ట్రాన్ని ఎవరు దివాళా తీశారు ప్రజలకి తెలిసే బుద్ధి చెప్పారని.అధిక పన్నులు వసూలు చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడన్నారు.

చంద్రబాబు, లోకేష్ ని టెస్ట్ చెయ్యలేదని బాధపడుతున్నట్టు ఉన్నారు.కంగారుపడకండి మిమ్మల్ని కూడా టెస్ట్ చేయిస్తాంమన్నారు.
LG పాలిమర్స్ కు జగన్ కు ఒకే లాయర్ ఉంటే తప్పేంటని. మంచి లాయర్ అయితే ఎవరైనా పెట్టుకుంటారని. లాయర్ విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చెయ్యడం సిగ్గిచేటన్నారు. రైతులపై 10, 500 కోట్లు వరకూ సహాయం చేస్తే చంద్రబాబుకి ఏడుపు ఎందుకు..?ఐదేళ్లలో పోలవరంకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పే ధైర్యం మీకు ఉందా..? 75 శాతం పనులు పూర్తి చేశామని దొంగ లెక్కలు చెబుతున్నారు..
వైస్సార్ ప్రోజెక్టు ప్రారంభించారు.. జగన్ పూర్తి చేస్తారన్నారు.

చంద్రబాబు రాయలసీమకు నీరిస్తే రెండు సీట్లే ఎందుకొస్తాయి..? రాయలసీమ నీటి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు..ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపేసి సిగ్గులేకుండా మహానాడు అని జరుపుకుంటున్నారు. ఏడాదిలో మూడు కోట్ల 40 లక్షల మందికి 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు సీఎం జగన్ అమలు చేశారన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పదవిలో ఉండి ఇంత సంక్షేమ పథకాలు అమలు చేసారా..?
వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ బ్రతికే చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు..టీడీపీలో ఉన్న దొంగలు, రౌడీలు ఎక్కడా లేరని. ఎమ్మెల్యేలు జారిపోతున్నారని భయంతో చంద్రబాబు డప్పు కొట్టుకోవడానికి మహానాడు పెట్టారు. చంద్రబాబు ఎప్పటికీ జిరో నే.. జగన్ ఎప్పటికి హీరో నే అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here