వరదలపై మం‍త్రి అనిల్‌ కుమార్‌ సమీక్ష..

వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తూ ఉండటంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ తెలిపారు. సోమవారం ఇరగేషన్‌ కార్యాలయంలో వరదలపై మంత్రి అనిల్‌ కుమార్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమాశానికి ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యార. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలు, చెరువులకు గండ్లు, కృష్ణ-గుంటూరు జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తగిన జాగ్రతలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here