క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి అనిల్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని సంతపేట రోమన్ క్యాథలిక్ చర్చ్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పండుగలు ఒకేసారి రావడం శుభపరిణామమన్నారు. ఇలాంటి పర్వదినాన మొదట విడతగా 15 లక్షల 70 వేల ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం జగన్‌కు మంచి జరగాలని  భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ఆశీసులు ఎల్లపుడు అందరికి ఉండాలని మంత్రి అనిల్ కుమార్ ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here