జగన్ డ్రామా డమాల్ _ జగన్ పై మినిస్టర్ నారాయణ కామెంట్స్

THE BULLET NEWS :

కోడి కత్తి డ్రామా అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో వైసిపి అధినేత జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు.. నెల్లూరు లో మీడియా తో మాట్లాడిన ఆయన అభిమాని చేతే దాడి చేపించుకుని సానుభూతి పొందాలని జగన్ చూశారని ఆయన ఆరోపించారు.. సాక్షాత్తు నిందితుడు శ్రీనివాస్ తల్లే తమ కుటుంబం జగన్ కి అభిమానులం అని చెబుతుందని, తమపై ఆరోపణలు చేస్తున్న వైసిపి నేతలకు అవి వినిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.. వైసీపీ గ్రాఫ్ పడిపోతుండటంతో ఇలాంటి డ్రామాలకు వైసిపి నేతలు తెరలేపారన్నారు.. దేశాన్ని, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బిజెపిని ఎదుర్కొనే దమ్ము ఒక్క సీఎం చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉందన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here