అభివృద్దే నా అజెండా

టీడీపీ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మునుప్పెన్న‌డూ లేనంత‌గా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసిన‌ట్లు రాష్ట వ్య‌వ‌సాయ‌శాఖామంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు.. తోటపల్లి గూడూరు మండలం కోడూరులో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించిన అనంత‌రం సౌత్ ఆములూరులో రూ.1.17 కోట్లతో చేపట్టిన గోదాము నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పొదలకూరులో రూ.3.18 కోట్లతో, వెంకటాచలంలో 3.23 కోట్లతో, కోడూరులో రూ.1.18 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులను సకల వసతులతో తీర్చిదిద్దామ‌న్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.50.05 కోట్లతో 59 ఆస్పత్రుల భవనాలు నిర్మించామ‌ని వ‌ల్ల‌డించారు. కోడూరులో దివంగత కావల్ రెడ్డి రంగారెడ్డి సమకూర్చిన స్థలంలో నిర్మించిన ఆస్పత్రికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించామ‌ని మంత్రి సోమిరెడ్డి వివ‌రించారు. ఆక్వా విద్యుత్ చార్జీలను రూ.2కి తగ్గించి చేపలు, రొయ్యల రైతులకు బాస‌ట‌గా నిలిచామ‌న్నారు. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు, ఆరబెట్టుకునేందుకు ఆములూరులో గోదాము, కల్లాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.రైతుల సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం రాజీ లేకుండా నిర్ణయాలు తీసుకుంటోంద‌ని మంత్రి సోమిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here