జగన్ గెలుపుపై సరికొత్త బెట్టింగ్స్…!!

జగన్ గెలుపుపై సరికొత్త బెట్టింగ్స్…!!

చంద్రబాబు,లోకేష్ మెజార్టీ కలిపినా…????

మరోవైపు జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలో ఆయన మెజార్టీపై కూడా పందాలు.

ఈసారి జగన్ మెజార్టీ ఎంత అంటూ కాయ్ రాజా కాయ్ .

ఏపీ ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నెలరోజుల సమయం ఉంది. దీంతో ఇప్పుడు రాష్ట్రమంతా దీనిగురించి మాట్లాడుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా… ఇటు పందెం రాయుళ్లు మాత్రం హాట్ సీట్లపై .. ప్రముఖ నేతల మెజార్టీలపై జోరుగా పందాలు కాస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఈసారి ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అంటూ కొన్నిసర్వేలు తేల్చేశాయి. దీంతో జనం కూడా అదే ధీమాకు వచ్చేశారు. ఇక ఆ పార్టీ అధినేత జగన్ సీఎం కావడం కూడా ఖాయమని కొందరు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలో ఆయన మెజార్టీపై కూడా పందాలు నిర్వహిస్తున్నారు. ఈసారి జగన్ మెజార్టీ ఎంత అంటూ కాయ్ రాజా కాయ్ అంటున్నారు.
ఇంకా ఎన్నికల ఫలితాలకు నెల రోజుల సమయం ఉన్నందున బెట్టింగులు జోరు ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ఫలితాలకు ఇంకా నెల రోజులే ఉండటంతో బెట్టింగ్ రాయుళ్లు చాలా యాక్టివ్‌గా ఉన్నారిప్పుడు. ఓవరాల్‌గా ఎన్నికల ఫలితాల గురించే కాక.. ఒక్కో నియోజకవర్గం మీద కూడా పందేలు నడుస్తున్నాయి. అభ్యర్థుల మెజారిటీల మీద కూడా ఫ్యాన్సీ బెట్టింగ్ చేస్తున్నారు పందెం రాయుళ్లు. ముఖ్యంగా పులివెందులలో జగన్ మెజారిటీ మీద అందరి దృష్టీ నిలిచి ఉంది. ఈసారి అక్కడ రికార్డు స్థాయి మెజారిటీ ఖాయమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు కంటే జగన్ అధిక మెజార్టీతో గెలుస్తారంటున్నారు. అందుకే పందెం రాయుళ్లు జగన్‌ మెజార్టీని… చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ మెజార్టీ కలిపి పందాలు కాస్తున్నారు. వీరిద్దరి మెజార్టీ కలిపిన కూడా జగన్ అంత మెజార్టీ రాదని జోరుగా పందాలు వేస్తున్నారు. చంద్రబాబు,నారా లోకేష్ మెజార్టీ కలిపినా కూడా వైసీపీ అధినేత జగన్ మెజార్టీ కంటే తక్కువే వస్తుందని బెట్టింగులు కాస్తున్నారు. మొత్తంమీద ఏపీలో ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా… బెట్టింగ్ రాయుళ్లు మాత్రం జోరుగా పందాలు కాసి సందడి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here