కొత్త టెన్షన్..! విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కోవిడ్ పాజిటివ్..

బ్రిటన్‌లో పుట్టి ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది కొత్త కరోనా వైరస్.. భారత్‌లోనై ఎంట్రీ ఇవ్వడంతో అలజడి రేపుతోంది. దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త వైరస్‌ను రాకుండా చూడాలని ప్రభుత్తం చేపడుతోన్న చర్యలకు బ్రిటన్‌ నుంచి భారత్‌కు వస్తోన్న విమానాలు ఆటంకంగా మారతున్నాయి. తాజాగా బ్రిటన్ నుంచి భారత్‌కు చేరకుకున్న విమాన ప్రయాణికుల్లో 20 మందికిపైగా కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు. ఇక, అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి… ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ట్రెసింగ్ చేసే పనిలోపడిపోయారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. తాజాగా విదేశాల నుంచి మరీ ముఖ్యంగా యూకే నుంచి వచ్చినవారిన గుర్తించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.. అయితే. విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో ఇప్పటికే ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరికొంతమంది ప్రయాణికుల కోసం ట్రెసింగ్ కొనసాగుతోంది.. మరోవైపు.. పాజిటివ్ వచ్చిన వాళ్లలో ఉంది లోకల్ కరోనా నా..? లేక కొత్త రకమా..? అనే అనుమానులు ఉండడంతో… జీన్ మ్యాప్ కోసం పాజిటివ్ పేషేంట్ల శ్యాoపిల్స్ ను సీసీఎంబీకి పంపించారు వైద్యాధికారులు. 

కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వైరస్‌ విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణికుల రాకపోకలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్‌టీపీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలు భయాందోళన చెందొద్దు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని చెప్పారు. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆమె కుమారుడికి పరీక్షలు జరపగా నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఆమె ఫస్ట్‌ క్లాస్‌ బోగీలో వచ్చినందున మిగిలిన వారితో కాంటాక్టయ్యే సందర్భాలు తక్కువేనని స్పష్టం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మహిళ నమూనాలు సేకరించి పుణె ల్యాబ్‌కు పంపామని, ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నందున ప్రజలెవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here