తల్లులకు పోషణ.. పిల్లలకు రక్షణ-47వ డివిజ‌న్ ఇంచార్జిలు

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను 47వ సచివాలయంలో డివిజ‌న్ ఇంచార్జిల ఆధ్వ‌ర్యంలో మంత్రి అనిల్ కుమార్ ఆదేశాలమేరకు ఇలపాక శివ కుమార్ ఆచారి ,శివపురం సురేష్ ,మజ్జిగ జయ కృష్ణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్‌ చాలా అవసరమని తెలిపారు.* *నేటి బాలలే రేపటి పౌరులని.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలన్నారు. ‘‘గర్భిణీల్లో 53 శాతం మందికి రక్తహీనత ఉంది. తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32 శాతం మంది ఉన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తామన్నారు . చదువు, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నాం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్‌ మీడియాన్ని కూడా మన జగన్ అన్న ప్రబుత్వం తీసుకొనివచ్చిదన్నారు . తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా వైఎస్ఆర్ పోషణ, వైఎస్ఆర్‌ పోషణ ప్లస్ పథకాలు ఉంటాయని ఇంచార్జిలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here