ఒకే దేశం- ఒకే ఎన్నిక..! వెబినార్లకు సిద్ధమైన బీజేపీ..

జమిలీ ఎన్నికలవైపే కేంద్రం అడుగులు వేస్తోంది… “ఒకే దేశం.. ఒకే ఎన్నిక” దేశానికి ఎంతో అవసరం అని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.. దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని పేర్రకొన్న ఆయన.. ఇదంతా అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.. ఈ అంశంపై కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే.. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై వెబినార్లు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీ… లోక్‌సభ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్నీ ఒకేసారి జరగాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ కోరికగా ఉంది.. ఇటీవల జరిగిన 80వ ఆల్‌ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశంలోనూ.. ఒకే దేశం-ఒకే ఎన్నికను ప్రస్తావించారు ప్రధాని..ఈ విధానంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.. దీని కోసం వెబినార్లను ఏర్పాటు చేయనున్నారు.. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల్లో పార్టీ సీనియర్‌ నేతలు, నిపుణులు సందేశాలు ఇవ్వనున్నారు.. మొత్తంగా ఈ నెలాఖరులోగా 25 వెబినార్లు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here