జ‌న‌సైనికులందరూ ఎన్నిక‌లకు సిద్దం కండి..కేతంరెడ్డి.

The Bullet News | Nellore

 • జ‌న‌సైనికుల‌కు కేతంరెడ్డి పిలుపు
  ప్ర‌జ‌లంతా ప‌వ‌న్ వెంటే ఉన్నార‌న్న వినోద్‌
  జ‌న‌సేన‌లో చేరిక‌లు
  వ‌చ్చే నెల 11వ తేదీన జర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు జ‌న‌సైనికులంతా సిద్దంకావాల‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌తి సైనికుడు ప‌నిచేయాల‌ని ఆ పార్టీ జిల్లా నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురంలో ప‌లువురు యువ‌త జ‌న‌సేన పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేతంరెడ్డి మాట్లాడారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించింద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు కొత్త నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నార‌న్నారు. అందుకే రాష్ట్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికారంలోకి రానున్నార‌న్నారు. త్వ‌ర‌లోనే ఏపీలో జ‌న‌సేన త‌మ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని తెలిపారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాయ‌న్నారు. వీటిని ఎదుర్కునేందుకు జ‌నసైనికులు సిద్ద‌ప‌డాల‌ని పిలుపునిచ్చారు. జ‌న‌సేన సిద్దాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనే రాష్ట్ర అభివృద్ది సాధ్య‌మ‌నే విషయాన్ని ప్ర‌జ‌ల‌కు తెలిపే బాధ్య‌త‌ను తీసుకోవాల‌ని సూచ‌న‌లిచ్చారు. నెల్లూరు న‌గ‌రంలో ప్ర‌జ‌లు ప‌డ్డ క‌ష్టాల‌ను మ‌రోసారి గుర్తు చేయాల‌న్న కేతంరెడ్డి.
  ——– జ‌న‌సేన‌లో చేరిక‌లు———
  ఇక వెంక‌టేశ్వ‌ర‌పురంలో జ‌న‌సేన పార్టీలో భారీగా యువ‌త చేరారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య స‌మీపంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్య‌లో యువ‌త త‌ర‌లివ‌చ్చి జ‌న‌సేనలో స‌భ్య‌త్వం తీసుకున్నారు. వీరికి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి పార్టీ కండువాలు క‌ప్పి స్వాగ‌తం ప‌లికారు. వెంక‌టేశ్వ‌ర‌పురం ప్రాంతంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను వారి నుంచి తెలుసుకున్న కేతంరెడ్డి, ఇప్ప‌టికే తాను ఈ ప్రాంతంలో అనేక ప‌ర్యాయాలు ప‌ర్య‌టించన‌ని, స్థానిక స‌మ‌స్య‌లు అనువ‌నువునా త‌న‌కు తెలుస‌ని, అధికారంలోకి వ‌స్తే ఆ స‌మ‌స్య‌ల‌న్నీ త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త జ‌న‌సేన వైపు చూస్తుంద‌ని, అంద‌రూ ప‌వ‌న్ కి అండ‌గా నిల‌వాల‌ని కేతంరెడ్డి వినోద్‌రెడ్డి యువ‌త‌కు పిలుపునిచ్చారు. పై కార్యక్రమం ఆలియా నాయకత్వంలో జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మూలం రమేష్, మునీర్,కారంపూడి కృష్ణా రెడ్డి కత్తి శ్రీను, హరి యాదవ్, ప్రవీణ్,కాకు మురళి రెడ్డి, శ్యామ్, మస్థానబి, ప్రభాకర్, వంశీ, జావిద్, తేజా రెడ్డి, శ్రీకాంత్, సంధాని బాషా, రంజిత్, జితేంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here