“వకీల్ సాబ్”కి పైరసీ షాక్..!!

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఆన్లైన్ లో హల్ చల్ చేస్తోంది. సినిమా థియోటర్ లో ప్రదర్శించిన మొదటి ఆట వెంటనే ఈ చిత్రం పైరసీ అయిపోయింది. చెన్నై కేంద్రంగా ఆన్లైన్ లో ఓ వెబ్ సైట్ లో పెట్టేసారు ఆ నిర్వాహకులు. తక్కువ డేటా నుండి ఎక్కువ జీబీ వరకు డౌన్లోడ్ చేసుకునే విధంగా పెట్టి చిత్ర నిర్మాతలు, బయ్యర్ల కడుపు కొట్టేలా చేశారు. సుమారు మూడేళ్ళ తర్వాత పవన్ సినిమా రిలీజ్ ఔతుండటంతో అటు నిర్మాతలు, ఇటు బయ్యర్లు, అభిమానులకు ఈ చర్య ఇబ్బంది కరమే. అంతే కాకుండా భారీ నష్టాలను కూడా చవి చూడాల్సి ఉంటుంది. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మండి పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here