మంత్రి గౌతమ్ కు పాజిటివ్..!

కోవిడ్ సెకండ్ వేవ్ అటు దేశంలో.. ఇటు మన రాష్ట్రంలో కరతాళనృత్యం చేస్తోంది. ఎవరు జాగ్రత్తగా లేకున్నా వారిని కమ్మేస్తుంది. మరి కొందర్ని కబళించేస్తోంది. చిన్నా, పెద్దా .. పేద, ధనిక తారతమ్యం లేకుండా, సామాన్యుడు, ప్రజా ప్రతినిధి అనే తేడా లేకుండా సోకేస్తుంది నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వేలాది మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా రాష్ట్ర IT శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది గత వారం రోజులుగా మంత్రి గౌతమ్ రాష్ట్రంలో నిండుకున్న ప్రాణ వాయువు ని అందుబాటులోకి తెచ్చేలా విజయవాడ నుంచి తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులు, పరిశ్రమల నిర్వాహకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతానికి మంత్రి కోవిడ్ వైద్యం పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here