నెల్లూరు బ్లాక్ మార్కెట్లో రేమిడిసివల్ ఇంజక్షన్..

కోవిడ్ మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలమై అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి . అయితే కోవిడ్ మహ మ్మారిసోకి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు , కొంతమంది వ్యక్తులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు . కోవిడ్ వైరస్ సోకిన వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వినియో గించే రెమిడెసివిల్ ఇంజెక్షన్‌ను కొంతమంది బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ లక్షల రూపాయలు అర్జిస్తున్నారు . దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజేశ్వర్ రెడ్డికి ఫిర్యాదులు అందడంతో డెకాయి ఆపరేషన్ నిర్వహించి ఈ బ్లాక్ మా ర్కెట్ గుట్టును రట్టు చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు . విజిలెన్స్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్ వీఈఓ రాజేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు . కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రెమిడెసివిర్ ఇంజెక్షన్ కీలకపాత్ర పోషిస్తుంది . వ్యా ధిగ్రస్తులు ఈ ఇంజెక్షన్‌ను వేయించుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో ప్రభుత్వం ఇంజెక్షన్ ధర రూ . 3490 లుగా నిర్ణయించింది . అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న శివాజీనగర్‌కు చెందిన రామకృష్ణ తనకు పరిచయం ఉన్న ఆసుపత్రుల నిర్వాహకులు , సిబ్బందిని మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇంజెక్షన్లు సేకరించి ఒక్కో ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ధర కంటే పదిరెట్లు అధిక ధరలకు విక్ర యిస్తున్నట్లు ఆర్ ఓ తెలిపారు . వచ్చిన సొమ్ములో అతనికి సహకరించిన వారికి కూ డా వాటాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు . ఆర్ వీరజ్ రాజేశ్వర్ రెడ్డి నేతృ త్వంలో ప్రత్యేక బృందాలుడెకాయి ఆపరేషన్ నిర్వహించి కోవిడ్ వైరస్ బాధితులవలె రామకృష్ణను ఫోన్ లో సంప్రదించారు . ఈ ఇంజెక్షన్ ధర రూ . 40 వేలు చెప్పగా .. విజిలెన్స్ అధికారులు అతనితో బేరమాడి ఒక్కో ఇంజెక్షన్ రూ . 25 వేలు చొప్పున 18 ఇంజెక్షన్లను రూ . 1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు . రామకృష్ణ , బృందావనంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఇంజెక్షన్లు అందించి నగదు తీసుకునేందుకు రాగా .. విజిలెన్స్ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు . అతనిని విచారించగా .. నగరంలోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స అందిస్తున్న ల్యాలో పనిచేస్తున్న షరీఫ్ అనే వ్యక్తి ఇంజెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు . విజిలెన్స్ అధికారులు ఆ ఆసుపత్రికి వెళ్లేసరికే అప్పటికే షరీఫ్ పరారై ఉన్నాడు . డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ద్వారా సదరు ఆసుపత్రిలో స్టాక్ పరిశీలన చేస్తున్నట్లు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు . తదుపరి విచారణ నిమిత్తం సదరు రామకృష్ణను సంతపేట పోలీసులకు అప్పగిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు . ఈ డెకాయి ఆపరేషన్లో ఇన్ స్పెక్టర్ వి సుధాకర్ రెడ్డి , డీసీటీఓ విష్ణురావు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here