సోమశిలకి చేరుతున్న వరద నీటి ప్రవాహం..

షేక్ అస్లాం సోమశిల జలాశయానికి పెరుగుతున్న వరద నీరు. డ్యాం పై భాగంలో ఉండే జిల్లాలు కడప,కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మరియు శ్రీశైలం వరద నీరు రెండు జత కలవడంతో ఏకధాటిగా సోమశిల జలాశయంకు వరదనీరు చేరికతో ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 53 tmc లకు చేరుకుంది. కేవలం రెండు రోజుల్లో 14 టీఎంసీల నీరు వరదల కారణంగా జలాశయానికి చేరుకుంది. జిల్లాలో ఎటువంటి వర్షపాత నమోదు కాకపోయినా కేవలం మూడు టీఎంసీలకు పడిపోయిన జలాశయ నీటిమట్టం వరదల కారణంగానే 15 రోజుల వ్యవధిలో 47 tmc ల నీరు జలాశయానికి చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుఉంది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో డ్యాం నిండే స్థాయిలో నీరు చేరుకోవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం జిల్లాలలో తాగునీటి అవసరం కోసం ఒక టీఎంసీ నీరు కండలేరు కు, 950 క్యూసెక్కుల నీరు నెల్లూరు, కావలి తాగునీటికి పెన్నా నదికు,సాగునీటి అవసరం కోసం ఉత్తర కాలువకు 600క్యూసెక్కులు నీటి విడుదల జరుగుతుంది.. జిల్లాలో వర్షపాతం నమోదు కాకపోవడంతో గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది.. చెరువులలో నీటి చుక్క లేని కారణంగా రైతులు వ్యవసాయం చేయకుండా ఉన్నారు… ప్రస్తుతం జలాశయానికి వస్తున్న నీటితో వాళ్ళ ఆశలు చిగురిస్తున్నాయి. వెంటనే చెరువులకు నీటిని విడుదల చేయాలని వారు కోరుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here