న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ హెచ్చరిక…మితిమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు

నూతన సంవత్సర వేడుకల పేరుతో ఈనెల 31 రాత్రి, జనవరి 1వ తేదీనా మితిమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు జిల్లాలో అనుమతి లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ నేపద్యంలో ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచించారు. బుధవారం రాత్రి న్యూ ఇయర్ వేడుకలపై ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. జిల్లా అంతటా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 31వ తేదీ రాత్రి పోలీస్ మొత్తం రోడ్లపైనే ఉంటుందని, యువకులు గుంపులుగా చేరి బైక్ రైడ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపార సంస్థలు, ఇతర షాపులను రాత్రి 10 గంటలకు మూసివేయాలని, మద్యం దుకాణాలు, బార్లు ప్రభుత్వం నిర్ధేశించిన సమయం వరకే ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో మహిళలను, యువతులను ఈవ్ టీజింగ్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here