ఆస్పత్రి వద్దకు ఎస్పీబీ అభిమానులు..

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీబీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి నుంచి తాజాగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇప్పటికే పలువురు అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.కరోనా సోకి.. స్వల్ప లక్షణాలతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గురువారం సాయంత్రం ఉన్నట్టుండి మళ్లీ బాలు ఆరోగ్యం క్షీణించిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఎక్మో, వెంటిలేటర్ల ద్వారా ఆయనకి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here