నీట మునిగిన వరి.. ఆదుకోవాలంటున్న రైతులు

రైతులు కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షము వచ్చి రైతులను కొంపముంచేసిoది.డక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షము వలన వరి పంట నేలకు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడంలేదని బోరున విలపిస్తున్నారు.అకాల వర్షముతో నీటి పాలైన వరి పంట మొలకలు రావడంతో పాటు ధాన్యం రంగు మారే అవకాశం ఉందని రైతులు తెలిపారు.దీనితో రాబడి తగ్గుతుందన్నారు. గాలివాన వలన దెబ్బతిన్న వరి పంట ను పరిశీలించి జిల్లా వ్యవసాయ అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here