జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి సారూ .. కలెక్టర్ ను కలిసిన అఖిలపక్ష నేతలు..

నెల్లూరు జిల్లాల రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ అఖిలపక్ష నేతలతో కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ చక్రధర బాబు ను మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడంలో వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నెల్లూరు జిల్లా రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే కరోనా సంక్షోభంలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొని ధాన్యాన్ని పండించారని, ఇప్పుడు దానిని అమ్ముకునేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. ప్రభుత్వం దళారుల కంటే దారుణంగా వ్యవహరిస్తుందని తేమ విషయంలో రైతులకు నష్టం జరుగుతుందన్నారు ..ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకుని వెంటనే రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యదర్శి మరియు రూరల్ ఇంచార్జ్ రామరాజు , రైతు సంఘం నాయకులు రమణయ్య, సాబీర్ ఖాన్ సిపిఎం నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here