వచ్చే ఎన్నికల్లో సూళ్లూరుపేటలో మన జెండానే ఎగరాలి – కార్యకర్తలకు పిలుపునిచ్చిన గూడూరు ఎమ్మెల్యే సునీల్..

THE BULLET NEWS (GUDUR)-ప్రజల అభివృద్దే లక్ష్యం గా ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని.. ఇంటింటికి టిడిపి కి వస్తున్న అద్భుతమైన స్పందనే అందుకు నిదర్శనమని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు.. సూళ్లూరుపేట నియోజకవర్గం పార్టీ పరిశీలకులుగా నియమితులై తొలి సారి నాయుడుపేటలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి భారీ స్పందన వస్తుందన్నారు.. పథకాల గురించి అవగాహన కల్పించేందుకు ఇంటింటికి వెళ్తుంటే వారే తమకు వాటి గురించి వివరిస్తున్నారన్నారు. ప్రతి మహిళా, వృద్ధులు అందరూ చంద్రబాబు ని దేవుడిలా పూజిస్తున్నారని ఆయన వెల్లడించారు.. చంద్రన్న భీమా పథకం, పింఛన్, గ్యాస్, మరుగుదొడ్లు వంటి వాటిని వినియోగించు కున్న వారు చెబుతున్న మాటలు వింటుంటే చాలా ఆనందం గా ఉందన్నారు.. వచ్చే ఎన్నికల్లో సూళ్లూరుపేటలో కూడా మన జెండానే ఎగరాలన్నారు.. అందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు.. 2019లో కూడా మన ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని సునీల్ ధీమా వ్యక్తం చేశారు.. అనంతరం ఆయన్ని స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో పరసా రత్నం తదితరులు పాల్గొన్నారు…ప్రజల అభివృద్దే లక్ష్యం గా ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని.. ఇంటింటికి టిడిపి కి వస్తున్న అద్భుతమైన స్పందనే అందుకు నిదర్శనమని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు.. సూళ్లూరుపేట నియోజకవర్గం పార్టీ పరిశీలకులుగా నియమితులై తొలి సారి నాయుడుపేటలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి భారీ స్పందన వస్తుందన్నారు.. పథకాల గురించి అవగాహన కల్పించేందుకు ఇంటింటికి వెళ్తుంటే వారే తమకు వాటి గురించి వివరిస్తున్నారన్నారు. ప్రతి మహిళా, వృద్ధులు అందరూ చంద్రబాబు ని దేవుడిలా పూజిస్తున్నారని ఆయన వెల్లడించారు.. చంద్రన్న భీమా పథకం, పింఛన్, గ్యాస్, మరుగుదొడ్లు వంటి వాటిని వినియోగించు కున్న వారు చెబుతున్న మాటలు వింటుంటే చాలా ఆనందం గా ఉందన్నారు.. వచ్చే ఎన్నికల్లో సూళ్లూరుపేటలో కూడా మన జెండానే ఎగరాలన్నారు.. అందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు.. 2019లో కూడా మన ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని సునీల్ ధీమా వ్యక్తం చేశారు.. అనంతరం ఆయన్ని స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో పరసా రత్నం తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here