పెంచిన కరెంట్ చార్జీలకు నిరసనగా నెల్లూరులో నిరాహార దీక్ష చేపట్టిన టీడీపీ నాయకులు

కరోనా కష్టకాలంలో భారీగా పెంచిన కరెంట్ చార్జీలకు నిరసనగా నెల్లూరులో నిరాహార దీక్ష చేపట్టిన టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, తాళ్లపాక అనూరాధ తదితరులకు సంఘీభావం తెలిపిన పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ఈ సందర్బంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పేదల క్షేమమే తన క్షేమమని చెప్పే పెద్దమనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కల్లోల సమయంలో కరెంటు చార్జీలను భారీగా పెంచడం అన్యాయమని.మూలిగేనక్కపై తాటికాయ పడినట్టుగా అసలే కష్టాల్లో ఉన్న పేదలపై మరింత భారం వేయడం తగదని…పెంచడానికి ఒక హద్దు ఉంటుందని.

ఉదాహరణకు నెల్లూరు నగరానికి చెందిన కేవీ శేషమ్మకు ఫిబ్రవరిలో రూ.737 బిల్లు రాగా ఏప్రిల్ లో రూ.8,192 చెల్లించమని బిల్లు చేతికిచారని
పదింతల కంటే ఎక్కువగా బిల్లులు పెంచడం దుర్మార్గం అని అన్నారు.

నిర్మాణ రంగం స్తంభించిందని..అనేక రంగాలు కుదేలయ్యాయని….కూలీనాలి చేసుకుని బతికేవాళ్లు పనులు లేక అల్లాడుతున్నారన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజలపై భారం మోపడం దురదృష్టకరంమని..
మార్కెట్ లో ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వ విఫలమయిందని..నిత్యావసర వస్తువుల ధరలు 100 నుంచి 150 శాతం పెంచేశారని.ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ధరలను నియంత్రించే యంత్రాంగం లేని ఈ ప్రభుత్వమెందుకని.
ఓ వైపు కరెంటు బిల్లులు..మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు…ఇంకో వైపు మద్యం ధరలు. ప్రభుత్వానికి ఇష్టమైన మద్యం అమ్మిస్తుంది….తాగేవాళ్లకు ఇష్టం లేకపోయినా తాగాలి….తాగండి…చావండి..ఇదే ప్రభుత్వ ధోరణి అని మండిపడ్డారు.

టీడీపీ హయాంలో రూ.50 ఉన్న సీసాను రూ.200కి పెంచారు…అది కూడా మంచి బ్రాండ్లు ఉండవు…రోజుకు రెండు సీసాలు తాగితే పక్షవాతానికి గురయ్యే పరిస్థితి…ఒడి, బడి అని వెయ్యి రూపాయలు ఓ చేతితో ఇచ్చి ధరల దోపీడితో మరో చేతితో లాక్కుంటున్నారు..రాష్ట్రం పాలన సాగుతుందా…లేక గాలికి వదిలేశారా….
జగన్మోహన్ రెడ్డి మనస్సున్న ముఖ్యమంత్రి అయితే, ఈ ప్రభుత్వానికి కొంచెం మానవత్వమున్నా ఫిబ్రవరిలో వసూలు చేసిన విద్యుత్ బిల్లుల ప్రకారమే ఏప్రిల్, మే నెలలో కూడా వసూలు చేయాలన్నారు..ఏపీ మీదుగా సొంతూర్లకు పయనమైన వలస కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది…వారి కష్టాలు హృదయవిదారకంగా ఉన్నాయని ఆయన అన్నారు.మన ఇళ్లలో వారికి ఇలాంటి పరిస్థితే వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోమని.మన దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న బిడ్డలనే విషయం మరిచిపోకండని..వలస కార్మికుల విషయంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యాడని..ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా నిర్ధాక్షిణంగా వ్యవహరించడం తగదన్నారు…ఇప్పటికే వెళ్లిపోయిన వారు వెళ్లిపోయారు..చచ్చిపోయిన వాళ్లు చచ్చిపోయారు….ఇక మిగిలిన వారిని ఈ రోజు నుంచైనా సొంతూర్లకు పంపేందుకు చర్యలు తీసుకోవలని అయన హితవు పలికారు.
తడ, చిత్తూరులోని సరిహద్దుల వద్ద అధికారులను ఏర్పాటు చేసి కనీసం జిల్లాలను అయినా దాటించలేరా అని. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం చేస్తున్నారు…ఫొటోలకు ఫోజులిచ్చేవాళ్లకు, డెల్టా ప్రాంతాల్లో ఐదు కిలోల బియ్యం ఇచ్చి జనాన్ని బతికిచ్చామని గొప్పలు చెప్పుకునే వాళ్లకు రోడ్డుపై నడిచిపోయే పేదల కష్టం కనిపించడం లేదా…పాలకులకు ఇది కలకలం నిలిచిపోయే మచ్చ…ఇప్పటికైనా కళ్లు తెరిచి మానవత్వం చూపండి అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here