శ్వేతపత్రాల పేరుతో ఇదో కొత్త డ్రామా.. – మాజీ మంత్రి ఆనం కామెంట్

TheBulletNews- Hyderabad

మాట‌ల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌ను ముంచిన చంద్ర‌బాబు నాయుడు శ్వేప‌త్రాల పేరుతో మ‌రో కొత్త‌డ్రామాకు తెర‌లేపార‌ని మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి మండిప‌డ్డారు.. హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న సీఎం పై విరుచుకుప‌డ్డారు. ఎన్టీయార్ నుంచి పార్టీని లాక్కొని, ఆయ‌నికి వెన్నుపోటు పొడిచిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు శ్వేత‌ప‌త్రాలు అంటూ విడుద‌ల చేసిన‌వ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలే అన్నారు. మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు మోసం చేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ను‌ రాష్ట్రమే నిర్మిస్తుందని ఎలా చెబుతారని నిలదీశారు..విభజన చట్టం లో కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.. ఉక్కు కంపెనీ, దుగరాజు పట్నం,రామాయాపట్నాల నిర్మాణం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే తప్ప అభివృద్ధి కోసం‌ కాదన్నారు చంద్ర‌బాబునాయుడి ప‌త‌నం ప్రారంభం కాబోతుండ‌టంతో ఆయ‌న‌కు ఏం చేయాలో అర్దం కావ‌డం లేద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడి మాట‌లు న‌మ్మేందుకు రాష్ట ప్ర‌జ‌లు సిద్దంగా లేర‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here