నెల్లూరు నగరంలో తెదేపా శ్రేణులు పెద్దయెత్తున ఆందోళన..

పేదలకు ఇబ్బంది లేకుండా 12 అంకణాలు స్థలం ఇవ్వాలి.. టీడీపీ హయాంలో లో కట్టిన ఇళ్లను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి.. జగన్ ఇచ్చిన మాట తప్పారు.. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అంటూ.. తెదేపా శ్రేణులు నెల్లూరు నగరంలో పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు.నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు ముఖ్య కూడళ్లలో వైసీపీ కి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో విఆర్సి సెంటర్ లో శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు టీడీపీ శ్రేణులు కోటంరెడ్డి శ్రీనువాసుల రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో చంద్రబాబు కట్టించిన ఇళ్ళని లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసారు , నమ్మి ఓట్లేసిన ప్రజలకు వరదల్లో మునిగి పోయే ప్లాట్లను ఇస్తారా…..? అని ప్రశ్నించారు , ఎన్నికలు ముందు ఒక మాట ఎన్నికలు తరువాత ఇంకోమాట .వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని , ప్రజలకు ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం 12 అంకణాలు ఇవ్వాలి ఎద్దేవా చేసారు ,మరో ఒకటిన్నర సంవత్సరంలో జెమిలి ఎన్నికలు రాబోతున్నాయని మరలా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రనికి ముఖ్యమంత్రి కాబోతున్నారని అయన అన్నారు. శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు రౌడీలా వ్యవహరిస్తున్నారని , రాష్ట్ర ప్రజలు అన్ని గమణిస్తూనే ఉన్నారు సమయం వచ్చినపుడు తగినరీతిలో మీకు బుద్ధి చెబుతరని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here