పేదల పట్టాల పంపిణికి అడొస్తే పుట్టగతులుండవు : ఎమ్మెల్యే కాకాణి

నిరుపేదల కల నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్ధలాలను కేటాయించి పట్టాలు పంపిణి చేసి అందులో‌ ఇళ్లు కట్టేందుకు ముందుకు సాగుతుంటే టిడిపి నాయకు నీచరాజకీయలు చేసి అడ్డంకులు సృష్టించారని అయినా అదరకుండా బెదరకుండా పేదలకు పట్టాలు ఇచ్చి తీరామని మాటతప్పని మడమతిప్పని నేతగా జగన్ మోహన్ రెడ్డి సత్తా మరోమారు తేటతెల్లమైందని సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్వరెడ్డి అన్నారు. పేదలకు జానెడు జాగా ఇవ్వాలని‌ నిశ్చయించుకుంటే పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీలకు పుట్టగతులు ఉండవంటూ ఆయన ప్రతిపక్షాన్ని తీవ్ర స్ధాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పొదలకూరులో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇళ్ల పట్టాభిషేకం రెండు వారాల కంటే ముందుగా పెద్ద పండుగ వచ్చినట్లుగా వాతావరణం తలపించింది. ఎమ్మెల్యే కాకాణి తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అంతకు ముందు కాకాణికి కాడెద్దులతో , గుర్రాలతో ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. అలాగే వేదపండితులు పూర్ణకుంభంతో కాకాణికి స్వాగతం పలికారు. ఉపాధ్యాయుని ఎ. జ్యోతి ఆలపించిన మా తెలుగు తల్లికి గానం అందరినీ అలరించింది. అనంతరం శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇళ్ల పట్టాల పంపిణీకి కృషిచేసిన తహసిల్దార్ స్వాతి ,ఎంపీడీవో నారాయణరెడ్డి, సి.ఐ జి. గంగాధర్ రావు , ఎస్ ఐ కే. రహీంరెడ్డి లతో పాటు పలువురు అధికారులను కాకాణి సన్మానించారు. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ సక్రమంగా జరిగేందుకు తమకు సహకరించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని తహసిల్దార్ స్వాతితో పాటు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కాకాణికి పుష్పగుచ్చాలు అందించడంతో పాటు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా మహిళా నాయకురాలు నువ్వుల మంజుల, పొదలకూరు మాజీ మండల అధ్యక్షుడు కె. బ్రహ్మయ్య , మాజీ సర్పంచ్ తెనాలి నిర్మల , వైకాపా నాయకులు పెదమల్లు రమణారెడ్డి, గోగిరెడ్డి గోపాల్ రెడ్డి , బచ్చల సురేష్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here