కృష్ణపట్నం పోర్టు మొత్తం అదానీదే.. ఆ 25 శాతం కూడా..

THE BULLET NEWS :- K.Vamsi

కృష్ణపట్నం పోర్టు మొత్తం సొంతం చేసుకున్నారు అదానీ… కృష్ణపట్నం పోర్టులో పెట్టుబడుల్ని వంద శాతానికి పెంచుకుంది అదానీ పోర్ట్స్ లిమిటెడ్… తాజాగా, విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను కొనుగోలు చేసింది అదానీ పోర్ట్స్ లిమిటెడ్… దీంతో.. ఏడాదిలోగానే కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటాలను ఆదానీ చేజిక్కించుకున్నారు.. ఆ 25 శాతం వాటా విలువ రూ. 2800 కోట్లు ప్రకటించింది అదానీ పోర్ట్స్ సెజ్ లిమిటెడ్… మొత్తంగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదలాయించారు.. 2020లో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ పోర్ట్స్ సెజ్ లిమిటెడ్… 2020-21 ఆర్ధిక సంవత్సరంలో కృష్ణపట్నం పోర్టు విలువను రూ. 13,675 కోట్లుగా పేర్కొంది.. మరోవైపు.. ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగిన కృష్ణపట్నం పోర్టు.. 2025 నాటికి 500 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యాన్ని చేరుకుంటుందని అదానీ పోర్ట్స్ లిమిటెడ్ ప్రకటించింది. 

కృష్ణపట్నం నౌకాశ్రయం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో..  చెన్నై ఓడరేవులకు 180 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది లోతైన ఓడరేవు.. 20 కిలోమీటర్లు మరియు 6,800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణపట్నం పోర్టులో 300 ఎంఎమ్‌టిపిఎ మాస్టర్ ప్లాన్ సామర్థ్యం కలిగిఉంది.. కృష్ణపట్నం పోర్ట్‌లో 2025 నాటికి రెట్టింపు ట్రాఫిక్‌ను నిర్వహించడానికి ప్రణాళికలతో ఉంది.. బహుళ-ఉత్పత్తి మరియు కార్గో మెరుగుదల వ్యూహం ద్వారా అధిక వృద్ధిపై ఫోకస్ పెట్టింది. అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఒక పోర్ట్ కంపెనీ నుండి పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ ఫర్ ఇండియాగా అభివృద్ధి చెందింది. గుజరాత్‌లోని ముంద్రా, దహేజ్, ట్యూనా, హజీరా, ఒడిశాలోని ధమ్రా, గోవాలోని మోర్ముగావ్, విశాఖపట్నం మరియు కృష్ణపట్నం, మహారాష్ట్రలోని డిఘీ, కట్టుపల్లి.. వ్యూహాత్మకంగా ఉన్న 12 ఓడరేవులు, టెర్మిన్లతో ఇది భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ డెవలపర్ మరియు ఆపరేటర్‌గా ఆవిర్భవించింది