సీఎం చంద్ర‌బాబు నాయుడి మాట‌లు అక్ష‌ర స‌త్యాలు.. – ఎమ్మెల్యే కాకాణి

THE BULLET NEWS : దేశంలోని అవినీతిప‌రులంతా కాంగ్రెస్ తో జ‌త‌క‌డతార‌ని గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు చెప్పిన మాట‌లు అక్ష‌ర‌స‌త్యాల‌ని నెల్లూరు వైసీపీ జిల్లా అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు నాయ‌డు కూడా దేశంలో అత్యంత అవినీతిప‌రుడు కాబట్టే ఆయ‌న కూడా కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టార‌ని కాకాణి ఎద్దేవా చేశారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలంయ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న చంద్ర‌బాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతి పై మాజీ సీ ఎస్ లు చేసిన అవినీతి ఆరోపణలు పై చంద్రబాబు స్పందించాలన్నారు. విచారణలు అంటే భయం లేదని చెప్పే చంద్ర‌బాబు నాయుడు మాజీ సీఎంస్ అజ‌య్ క‌ల్లెం చేసిన ఆరోప‌ణ‌ల‌పై దర్యాప్తు చేయించే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. తన అవినీతి బయటపడుతుందనే సిబిఐ.ను రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకున్నార‌ని కాకాణి ఆరోపించారు..
అవినీతి పరులంతా కాంగ్రెస్లో చేరుతారని 2013 లో చంద్రబాబు చెప్పారని, చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టడం చూస్తుంటే నిజ‌మేన‌నిపిస్తోంద‌న్నారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అందరి పై సిబీఐ విచారణ కోరిన చంద్రబాబు ఇప్పుడు తన బండారం బయటపడుతుందనే సిబిఐ నే విమర్శిస్తున్నారన్నారు..అవినీతిపై పదే పదే మాట్లాడే పవన్… కళ్యాణ్
అజయ్ కల్లం ఆరోపణలపై స్పందించాల‌న్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here