ఇదేం డ్యూటీ సీఐ సార్…

సంత‌పేట సీఐ అన్వ‌ర్ భాష తీసుకున్న నిర్ణ‌యం కొంద‌రు ఉద్యోగులు ఆవేద‌న‌వ్య‌క్తం చేస్తున్నారు.. త‌న స్టేష‌న్ ప‌రిధిలో ఉండే ఉమెన్ ప్రొటెక్ష‌న్ పోలీసుల‌ను ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్బంగా రాత్రి స‌మ‌యాల్లో డ్యూటీలు వేశార‌ట‌.. స్టేష‌న్లోని కానిస్టేబుల్స్ తో పాటు డ్యూటీలు చెయ్యాల‌ని చెప్ప‌డంతోపాటు డ్యూటీలు కూడా వెయ్య‌డంతో స‌దరు మహిళా పోలీసులు ఆవేద‌న‌వ్య‌క్తం చేస్తున్నారు.. స్టేష‌న్ లోని సిబ్బందిని రాత్రి స‌మ‌యాల్లో బందోబ‌స్తుల‌కు ఉపయోగించుకోకుండా.. త‌మ‌కు డ్యూటీలు వెయ్య‌డం ఏంట‌ని కొంద‌రు మ‌హిళ పోలీసులు వాపోతున్నారు.. ఇదే విష‌యాన్ని సీఐను అడ‌గ‌లేక‌.. ఇంట్లో ఉండే పెద్ద‌ల‌ను ఒప్పించ‌లేక వారు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.. ప‌గ‌లంతా త‌మ చేత‌ డ్యూటీలు చేయించుకుని. రాత్రి స‌మ‌యానికి ఇంటికి పంపితే బాగుంటుంద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.. మ‌హిళా కార్య‌ద‌ర్శుల‌కు రాత్రి స‌మ‌యాల్లో డ్యూటీలు వెయ్య‌డంపై స‌ద‌రు ఉద్యోగ కుటుంబ స‌భ్యులు కూడా ఆందోల‌న వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here