నెల్లూరు టీడీపీలో టిక్కెట్ల టెన్ష‌న్ – అమ‌రావతికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. సాయంత్రానికి స్ప‌ష్ట‌త‌

The Bullet News – Nellore

నెల్లూరు టీడీపీలో టిక్కెట్ల టెన్ష‌న్ స్టాట్ అయింది.. జిల్లా ముఖ్య‌నేత‌లంద‌రూ ఇవాళ అమ‌రావతికి ప‌య‌నమ‌య్యారు.. సీఎం అధ్య‌క్ష్య‌త‌న జ‌ర‌గబోయే జిల్లా సమన్వయ కమిటీలో టిక్కెట్ల వ్య‌వ‌హారం కొలిక్కి వచ్చే అవ‌కాశ‌ముంది.. దీంతో ఇప్ప‌టికే జిల్లా అధ్య‌క్షులు, ఎమ్మెల్సీ బీదా ర‌విచంద్ర‌, మంత్రులు సోమిరెడ్డి , నారాయణ అమ‌రావ‌తికి చేరుకున్నారు.
ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఎంపీతో పాటు జిల్లాలోని టిక్కెట్ల వ్య‌వ‌హారంపై స్ప‌ష్ట‌త రానుంది.. దీంతో జిల్లాలోని అశావాహులు, సిట్టింగ్ ల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది.. ఎంపీ అభ్య‌ర్దిగా బీదా మ‌స్తాన్ రావు ఖ‌రారైందంటూ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారానికి తెర పడనుంది. ఈ ప్ర‌చారానికి ముగింపు ప‌లికితే అన్ని స్థానాల‌పై దాదాపు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.. దాంతో పాటు కోవూరు, ఉదయగిరి, సూళ్లూరుపేట నియోజక వర్గాల్లో నెలకొన్న సందిగ్దతపైన ఓ క్లారిటీ రానుంది. కోవూరు నుంచి బరిలో ఉంటానంటూ సీనియర్ నాయ‌కులు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి గత మూడు రోజులుగా అమరావతిలో మకాం వేసి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పొలంరెడ్డి త‌న‌కే టిక్కెట్ అనే ధీమాతో ఉన్నారు. సూళ్లూరుపేట విషయంలో పరసాకు హ్యాండిస్తారనే ప్ర‌చారం కూడా న‌డుస్తోంది. ఇక ఉదయగిరి విషయంలో బొల్లినేని పెట్టుకున్న ఆశలు సజీవంగా ఉండే అవకాశం ఉన్న‌ప్ప‌టికీ చివ‌రి నిమిషం దాకా దానిపై క‌న్ఫ‌ర్మేష‌న్ ఉండ‌బోదు.. మ‌రో ప‌క్క జిల్లా ముఖ్య‌నేత‌ల‌పై తీరుపై అసహ‌నంతో ఉన్న కిలారీ వెంకటస్వామి నాయుడు, నూనె మల్లికార్జున యాదవ్, శైలేంద్రబాబు, జలదంకి సుధాకర్ వంటి నేతలకు అధిష్టానం నుంచి పిలుపు రాక‌పోవ‌డంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.. మొత్తంగా చూసుకుంటే.. ఎవ‌రిలో బ‌రిలో ఉండేది.. ఎవ‌రు రెబ‌ల్ అభ్య‌ర్ది అనేది సాయంత్రానికి ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here