నెల్లూరులో విషాదం ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు ,ఈత రాకపోవడంతో చెరువులోని లోతైన నీటి గుంటలోపడి మృతి చెంద రు ముగ్గురు విద్యార్థులు రాజేష్,సాయి, హలీం పోలీసులు గుర్తించారు.మృతదేహాలను పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు..రాత్రి సహాయక చర్యలకు ఆటంకం కలగడంతో.. ఈరోజు ఉదయం పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here