వరకట్న వేధింపులకు మరో యువ డాక్టర్ మృతి

THE BULLET NEWS (KODAVALUR)-వివాహమైన రెండు నెలలకే వరకట్న వేధింపులుకు యువ డాక్టర్ బలైన ఘటన మూడు రోజుల క్రితం చెన్నైలో చోటు చేసుకుంది.మృతురాలి స్వగృహమైన కొడవలూరు మండలం గుండాలమ్మ పాళేనికి మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని  తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మ పాళేనికి చెందిన  నెల్లూరు శశిధర్రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అయిన నెల్లూరు శాలిని (26) కి గత ఏడాది నవంబర్ 29 న కడపకు చెందిన విష్ణు భరత్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు శాలిని ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేస్తుండగా విష్ణు భరత్ రెడ్డి డాక్టర్ గా కొనసాగుతున్నారు .ఆయన కొంతకాలంగా నెల్లూరు అపోలో ముత్తుకూరు ఏపీజెన్కోలో డాక్టర్ గా పనిచేశారు.

వివాహానికి కొద్ది రోజుల ముందే చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్గా చేరారు .వివాహమయ్యాక షాలినిని తీసుకుని చెన్నైలోనే ఉంటున్నారు . కట్న కానుకల కింద అరవై లక్షల వరకు ఇచ్చినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు .అయినప్పటికీ ఆశ తీరక పెళ్లయిన మరుసటి రోజు నుంచి అదనపు కట్నం కోసం షాలినిని వేధించడం ప్రారంభించాడని తెలిపారు .కుటుంబ సభ్యులకు ఫోన్ కూడా చేయనీకుండా శాలిని మానసికంగా వేధించాడని ఆవేదన చెందారు .ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శాలని చనిపోయింది .అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలపకుండా మంగళవారం తమ కూతురు గాయపడిందని వెంటనే రావాలని ఫోన్ చేయగా కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నై చేరుకున్నారు .మృతదేహాన్ని స్వగ్రామమైన గుండాలమ్మ పాళేనికి తీసుకొచ్చారు .మృతురాలి భర్త చెన్నైలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు మృతురాలు బంధువులు తెలిపారు .భర్త ఉరివేసి హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు .ఎంతో కష్టపడి డాక్టర్ చదివిస్తే ఉసురు తీశాడని కన్నీరు పెట్టుకున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here